వాస్తవానికి ఈజిప్ట్ పిరమిడ్లు మమ్మీలకు( Mummy ) చాల ప్రసిద్ధి చెందినవని అందరికీ తెలిసిన విషయమే.అయితే ఈ ఈజిప్ట్ పిరమిడ్, మమ్మీల వెనక అనేక కథనాలు ఉన్నాయని కూడా అందరికి తెలిసిందే.
అయితే మతపరమైన ఆచారాల కోసం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఒక అధ్యాయంలో కూడా తెలిసింది.అయితే ఇటీవల ఒక మమ్మీ ముసలిని( Crocodile Mummy ) గుర్తించిన శాస్త్రవేత్తలు దానిని భద్రపరిచి ఉంచారని సమాచారం.
అయితే., ఈ అధ్యయనంలో భాగంగానే ఆ ముసలిని స్కానింగ్ చేశారు.
ఆధారంగా పొట్టలో జీర్ణం కాని చేప, చేప హుక్కు ఉన్నట్లు తెలుస్తుంది.దీన్ని వేటాడి పట్టుకుని వచ్చిన అనంతరం బలి ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు.
వాస్తవానికి ఈజిప్టులో( Egypt ) పురాతన మనుషుల్ని కాకుండా జంతువులను కూడా మమ్మీ లాగా మార్చే వారట.అయితే ఈ క్రమంలోనే 3000 నాటి ముసలి మమ్మీ పై పరిశోధనలు చేపట్టారు.అయితే ఆ మొసలి మమ్మీగా చేయబడే ముందు ఆ ముసలికి ఆహారం ఏమి ఇచ్చారు అని, ఎలా చంపారు అని పలు ప్రశ్నలు శాస్త్రవేత్తలకు తలెత్తాయి.ఈ క్రమంలోనే ఆ మమ్మీ ముసలిని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కుకు తరలించి సిటీ స్కాన్ ను నిర్వహించారు.
ఈ స్కానింగ్ రిపోర్ట్ ఆధారంగా ఆ ముసలి కడుపులో గ్యాస్ట్రోలిత్లు కనిపించాయి.గ్యాస్ట్రోలిత్లు అంటే.అలిమెంటరీ కెనాల్‌లో కనిపించే చిన్న రాళ్లు. చాలాసార్లు ఆ ముసలి చిన్నచిన్న రాళ్లను మింగేసిందట దీంతో ముసలి మమ్మీగా చేసే వ్యక్తులు దాన్ని అంతర్గత అవయవాలను బయటకు తీయలేదని తెలుస్తుంది.
ఆ పదార్థాలు అన్ని కూడా అలాగే ఆ ముసలి పొట్టలో ఉన్నట్లు సమాచారం.అయితే ఇప్పటికే ఈజిప్టులో చాలా మొసల్లు మమ్మీ లాగా కనబడ్డాయి.ఇందులో ప్రస్తుతం పరీక్షించిన ముసలి చాలా పెద్దది.అంతేకాకుండా పూర్వం ఈజిప్టులోని ప్రజలు కూడా మొసలి చర్మాని ధరించేవారని సమాచారం.