టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( Hero Prabhas )గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టారు.ఇకపై డార్లింగ్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ ఎక్కడికో వెళ్లిపోతోంది.
రీసెంట్గా కల్కి సినిమాతో ఇంటర్నేషనల్ రేంజుకి చేరుకున్నారు.దీంతో ప్రభాస్ ఎదుగుదల గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ( Celebrities )మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఒక సభలో మాట్లాడుతూ ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు.ప్రభాస్ లేకపోతే బాహుబలి సినిమా( Baahubali movie ) లేదంటూ కామెంట్స్ చేశారు.క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు.దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఇందులోనే పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని అన్నారు.సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్టం రాజు అని ఆయన తెలిపారు.
అలానే హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన బాహుబలి సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేమని పొగడ్తలు కురిపించారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియో చూసిన ఆ ప్రభాస్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.అలాగే తెలంగాణ సీఎం రేవంత్ కి థాంక్స్ చెబుతున్నారు.
ఇకపోతే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.రాధేశ్యామ్, సాహో,కల్కి, సలార్, ఆదిపురుష్ లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటించి తనకున్న క్రేజ్ ని మరింత పెంచుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో హను రాఘవపూడి సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2, రాజాసాబ్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అలా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ఆరు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.