రక్షా బంధన్ స్పెషల్.. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కి హిట్ గా నిలిచిన సినిమాలివే!

సినిమా ఇండస్ట్రీలో అమ్మ సెంటిమెంటుతో, అలాగే నాన్న సెంటిమెంటుతో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలై మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.అలా సిస్టర్ సెంటిమెంట్తో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్టుగా నిలిచాయి.

 Raksha Bandhan Special Telugu Movies, Raksha Bandhan, Movies, Rakhi, Jagapatibab-TeluguStop.com

నేడు రక్షాబంధన్ ( Rakshabandhan )సందర్భంగా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఆ సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పుట్టింటికి రా చెల్లి.

క‌న్న‌డ కింగ్ అర్జున్ ( puttintiki ra chellli ) నటించిన చిత్రం పుట్టింటికి రా చెల్లి.

Telugu Brother Bomali, Bruce Lee, Gold Bangles, Rakhi, Raksha Bandhan, Rakshaban

సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో వ‌చ్చిన ఈ సినిమాను చూడ‌డానికి అప్ప‌ట్లో మ‌హిళ‌లు ఎండ్ల‌బండ్ల‌లో వెళ్లేవారు.రాఖీ రోజు త‌ప్ప‌క చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒక‌టి.ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ వేదిక‌ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా( Hitler movie ) కూడా ఒకటి.ఈ సినిమాలో ఐదుగురు చెల్లెళ్ల బాధ్యతలను చూసుకునే అన్నగా చిరు న‌టించ‌డం హైలైట్‌ గా చెప్పవ‌చ్చు.

ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ యూట్యూబ్ వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోంది.దివంగత హీరో శ్రీహరి, త్రిష,సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా( Nuvvostanante Nenoddantana ).ఇందులో కూడా సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే.

Telugu Brother Bomali, Bruce Lee, Gold Bangles, Rakhi, Raksha Bandhan, Rakshaban

చిన్న‌ప్పుడే అమ్మ‌నాన్న‌ల‌ను కోల్పోయి చెల్లికి అన్ని తానై అండ‌గా ఉంటాడు శ్రీహ‌రి.అయితే త‌న చెల్లిని ప్రేమిస్తున్నాను అంటూ ఇంటికి వ‌చ్చిన సిద్ధార్థ్‌ను శ్రీహ‌రి ఏం చేశాడు.చివ‌రికి వాళ్లిద్ద‌రి పెళ్లికి ఒప్పుకున్నాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్ సెంటిమెంట్ తో చేసిన సినిమా అర్జున్( Arjun ).ఒక్క‌డు లాంటి బ్లాక్ బస్ట‌ర్‌ను అందించిన గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.అత్త మామాల నుంచి త‌న అక్క‌ను కాపాడుకునే త‌మ్ముడి పాత్ర‌లో మ‌హేశ్ ఇందులో క‌నిపించాడు.ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​లో స్ట్రీమింగ్ అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమా( Annavaram movie ) కూడా రాఖీ పండుగ రోజు చూడాల్సిన సినిమాలలో ఒకటి.రాఖీ పండుగ వచ్చింది అంటే చాలు ఈ సినిమాలోని పాట మొదటి గుర్తుకు వస్తూ ఉంటుంది.

అలాగే రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమా కూడా ఒకటి .జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే.త‌న చెల్లికి ఎంత చిన్న క‌ష్టం వ‌చ్చిన చూసుకునే అన్న‌య్య పాత్రల్లో తార‌క్ క‌నిపించ‌డం ఈ మూవీకే హైలైట్‌గా నిలిచింది.కేవలం ఈ సినిమాలు మాత్రమే కాకుండా.

జ‌గ‌ప‌తిబాబు శివరామరాజు, చెల్లెలి కాపురం, పల్నాటి పౌరుషం, రక్త సంబంధం, బంగారు గాజులు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, బ్రూస్​ లీ, కత్తి, హనుమాన్, వీరసింహారెడ్డి, భోళాశంకర్, బ్రో, పెద్దన్న వంటి సినిమాలు కూడా సిస్టర్​ సెంటిమెంట్​తో వచ్చి మంచి సక్సెస్ సాధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube