నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణ పరిధిలో విద్యుత్ అధికారుల పనితీరు మెరుగుపడాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నో రివ్వూ మీటింగ్స్ పెట్టి,ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పినా ఆయన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మిర్యాలగూడ రూరల్ విద్యుత్ శాఖ అధికారుల తీరు ఉండడం గమనార్హం.ఇంకా విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో నందిపహాడ్ రోడ్డులో ట్రాన్స్ఫర్మర్ చుట్టూ చెట్లు మొలచి ట్రాన్స్ఫర్మర్ పైకి ఉండటం వలన అవి పని చేస్తున్నాయా లేదా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరైనా తెలిసి తెలియక వాటి వద్దకు వెళితే జరిగే ప్రమాదం ఊహించలేనిదని,ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? విద్యుత్ అధికారులదా లేకపోతే అధికార పక్ష నాయకులదా? అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని ట్రాన్స్ఫర్మర్స్ చుట్టూ అల్లుకుపోయిన చేట్లను తొలగించి,దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.