సొంత ఊరిలో 100 ఎకరాల పొలం.. ఈ జబర్దస్త్ యాంకర్ సంపాదన మామూలుగా లేదు?

జబర్దస్త్ ( Jabardasth ) యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ రష్మీ ( Rashmi ) ఒకరు.ఈమె వచ్చి రాని తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Anchor Rashmi Gives Clarity On 100 Acres Properties In Her Own Village, Rashmi,-TeluguStop.com

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు ఇలా ఈ టీవీలో ఈమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.ఇక రష్మీ మొదట్లో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు కానీ ఈమె హీరోయిన్గా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

ఇలా హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోవడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఈమె భారీగా సంపాదించిందని అంతేకాకుండా ఈమె స్వగ్రామంలో ఏకంగా 100 ఎకరాల పొలం కొనుగోలు చేసిందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమె సంపాదన గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

రష్మీ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే.

Telugu Anchor Rashmi, Jabardasth, Rashmi-Movie

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఇదే ప్రశ్న ఎదురయింది.ఇలా మీ సొంత గ్రామంలో 100 ఎకరాల పొలం కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.ఇందులో నిజం ఎంత అనే ప్రశ్న ఎదురు కావడంతో రష్మీ సమాధానం చెబుతూ నా సొంత గ్రామంలో అమ్మమ్మ వాళ్లు అమ్మకు ఇచ్చిన పొలం ఉంది.

అయితే అది 100 ఎకరాలు కాదని తెలిపారు.ఇలా నేను 100 ఎకరాల పొలం కొన్నానని తప్పుడు వార్తలను రాస్తూ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు నాపై అటాక్ చేసేలాగా చెయ్యొద్దు అంటూ సరదాగా చెప్పేశారు.

Telugu Anchor Rashmi, Jabardasth, Rashmi-Movie

ఇకపోతే గతంలో ఈమెకు ఒక నిర్మాత ఖరీదైన బంగ్లాతో పాటు కారు కూడా కానుకగా ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై ఈమె స్పందించారు.నాకు ఒక ఇల్లు ఉంది కారు ఉంది.బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంది అయితే ఇదంతా కూడా నేను కష్టంతో సంపాదించుకున్న డబ్బుతోనే కొన్నానని ఎవరు నాకు కానుకలు ఇవ్వలేదని ఆ వార్తలను పూర్తిగా ఖండించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube