ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగిన వారందరూ కూడా ఇప్పుడు సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.ఇక సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా సినిమాలలో భాగం చేస్తున్నారు.
అక్కడ వారికి ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకొని పలువురు స్టార్ హీరోలను తమ సినిమాలలో విలన్ పాత్రలలో తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
![Telugu Bhaira, Devara, Koratala Shiva, Saif Ali Khan, Saifali, Tollywood-Movie Telugu Bhaira, Devara, Koratala Shiva, Saif Ali Khan, Saifali, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/saif-ali-khan-remuneration-for-devara-movie-detailsd.jpg)
డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్( NTR ) హీరోగా నటించిన చిత్రం దేవర( Devara ) ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నారు.ఇక ఇటీవల ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) పుట్టినరోజు సందర్భంగా గ్లింప్ వీడియోని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ బైర( Bhaira ) అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
![Telugu Bhaira, Devara, Koratala Shiva, Saif Ali Khan, Saifali, Tollywood-Movie Telugu Bhaira, Devara, Koratala Shiva, Saif Ali Khan, Saifali, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/saif-ali-khan-remuneration-for-devara-movie-detailss.jpg)
ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న తరుణంలో ఈ సినిమాలో నటించడం కోసం ఈయన తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న ఈయన విలన్ గా నటించడం కోసం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ మేకర్స్ ఆయన అడిగిన మొత్తంలో చెల్లించారట.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు మార్కెట్ పరంగా బాగా కలిసొస్తుందన్న ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ చెల్లించారని తెలుస్తుంది.ఇలా విలన్ పాత్ర కోసం 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.