కెనడా కేంద్రంగా భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతున్న ఖలిస్తాన్ ( Khalistan )మద్ధతుదారులు మరోసారి రెచ్చిపోయారు.ఏకంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలకలం సృష్టించారు.
టోరంటో సిటీ హాల్లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో ఖలిస్తానీయులు భారత వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు కత్తులతో భారత జాతీయ పతాకాన్ని చించివేసి నానా రాద్ధాంతం సృష్టించారు.వేడుకల్లో పాల్గొన్న భారతీయ కమ్యూనిటీని ‘‘గో బ్యాక్ టూ ఇండియా ’’( Go Back to India ) అని బెదిరింపులకు దిగారు.
కెనడాలో గతంలోనూ ఇండియా డే పరేడ్ కార్యక్రమాల్లో ఖలీస్థానీయులు ఉద్దేశ్యపూర్వకంగా అలజడి సృష్టించిన ఘటనలున్నాయి.ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాది , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్యతో అక్కడి ఖలిస్తాన్ గ్రూపులు భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ కెనడియన్ హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

దీనిలో భాగంగానే భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టార్గెట్ చేశాయి.దీనిని ముందుగానే పసిగట్టిన కెనడా భద్రతా ఏజెన్సీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి.ఖలిస్తాన్ సిక్కులు, కెనడియన్ హిందువుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు ఈ పరేడ్ మధ్యలో చేరాలని ప్లాన్ చేయడంతో ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది.

ఇండో కెనడియన్ సాంస్కృతిక సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు పనోరమా ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.పనోరమా ఇండియా చైర్ వైదేహి భగత్ ( Panorama India Chair Vaidehi Bhagat )మాట్లాడుతూ.ఈసారి భారతదేశానికి వెలుపల అతిపెద్ద త్రివర్ణ పతాకం ఉంటుందన్నారు.వివిధ భారతీయ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న 20 ఫ్లోట్లు ఈ వేడుకల్లో ఉంటాయని తెలిపారు.టొరంటో డౌన్‌టౌన్‌లోని నాథన్ ఫిలిప్స్ స్క్వేర్‌లో ఈ ఉత్సవాలు జరిగాయి.సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు వివిధ రకాల భారతీయ వంటకాలు ఈ ఈవెంట్‌కు మరింత శోభను తీసుకొచ్చాయి.