సాధారణంగా అబ్బాయిలు తమకంటే తక్కువ హైట్ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు ఇక అమ్మాయిలు కూడా ఆరడుగుల అందగాడిని ఇష్టపడతారు.కానీ ఇటీవల ఏకంగా ఏడు అడుగులు ఎత్తు ఉన్న ఒక యువతి 3 అడుగుల ఎత్తు ఉన్న ఒక యువకుడితో లవ్‌లో పడింది.
ఆ యువకుడు, ఈ యువతి కలిసి డ్యాన్స్ చేస్తూ, తమ లవ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో వారి డ్యాన్స్ కి సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది.
ఈ ప్రేమ జంట పేర్లు గబ్రియేల్ పిమెంటెల్, మేరీ టెమారా.( Gabriel Pimentel, Mary Temara ) హైట్స్ లో చాలా తేడా ఉన్నా వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిసే చాలామంది ఫిదా అవుతున్నారు.
గబ్రియేల్‌ను “కింగ్” ( King ) అనే ముద్దు పేరుతో పిలుస్తారు, ఈ యువకుడు “రాణి” అని తన గర్ల్‌ఫ్రెండ్ మేరీని పిలుస్తాడు.ఆమెపై ఎప్పుడూ ప్రేమ కురిపిస్తుంటాడు.
వారి ఎత్తులో తేడా ఉన్నప్పటికీ, నృత్యం చేస్తూ, కౌగిలించుకుంటూ, ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటూ హ్యాపీగా ఉంటారు.సోషల్ మీడియా వీడియోలు వారి ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి, ప్రేక్షకులను కదిలిస్తాయి.
గేబ్రియెల్ 23,000 మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు, మేరీకి 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.వారు ఇటీవల షేర్ చేసిన ఒక వీడియో కేవలం రెండు రోజుల్లోనే 25 లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో లైక్‌లు, షేర్‌లను సాధించింది.గేబ్రియెల్, మేరీ ఒక డిఫరెంట్ కపుల్ అని చెప్పుకోవచ్చు అయినా వారి ప్రేమ కథ చాలా మందిని ఆకట్టుకుంది.
నెటిజన్లు ప్రేమకు ఏదీ అడ్డు కాదని ముఖ్యంగా శారీరక రూపంతో సంబంధమే లేదని కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది వారి ప్రేమ నిజమైనదా అని అనుమానిస్తున్నారు.కొందరు వారిని మెచ్చుకుంటే మరి కొందరు ఇదేం జంట అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు, ప్రజలు ఏమనుకున్నా, గేబ్రియెల్, మేరీ తమ రిలేషన్‌షిప్ లో సంతోషంగా ఉన్నామని, సమాజం ఏర్పరచిన పరిమితులను ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టంగా తెలియజేస్తున్నారు.