ప్రభాస్ కి ఏమిచ్చిన రుణం తీరదు.. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన కల్కి సినిమా( Kalki Movie ) ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ సినిమా నిర్మాత వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ ( Aswini dutt ) ను కొంతమంది ప్రభాస్ అభిమానులు ఘనంగా సన్మానించారు.

 Producer Aswini Dutt Interesting Comments On Kalki 2 Movie, Kalki 2, Prabhas, As-TeluguStop.com

ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా అశ్వినీ దత్ కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా అశ్వినీ దత్  మాట్లాడుతూ.కల్కి సినిమా ఇంత గొప్ప సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రభాస్ అని తెలిపారు.మనం ఏం చేసినా ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమని వెల్లడించారు.

కల్కి పార్ట్ 2 మాత్రం ఇంతవరకూ తెలుగులో ఎవరూ తీయని విధంగా వస్తుందని ఈయన వెల్లడించారు.కానీ ఎప్పుడు విడుదలవుతుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ గత ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ 2026 వేసవి సెలవులకు రాబోతుందని తెలిపారు.

ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ పూర్తి అయినట్లు పలు ఇంటర్వ్యూలలో అశ్వినీ దత్ పేర్కొన్నారు.అయితే కల్కి సినిమాటిక్ యూనివర్స్ మొత్తం ఎన్ని భాగాలు ఉండే అవకాశం ఉందనేదానిపై కూడా దత్ తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దాని తర్వాత సుప్రీం యాస్కిన్ లీడ్‌ రోల్‌లో ఓ సినిమా వస్తుందని చెప్పారు.ముఖ్యంగా పార్ట్ 2లో ప్రభాస్ -కమల్ హాసన్ మధ్య భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయని వెల్లడించారు.ఏది ఏమైనా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube