టాలీ వుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సిద్ధం చేసుకున్నారు డైరెక్టర్ కృష్ణ వంశీ( Krishna Vamshi ) ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక ఇటీవల కాలంలో కృష్ణవంశీ సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.
ఇక ఈయన చేసిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.ఇక ఈయన స్టార్ హీరో కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఆ స్టార్ హీరో ఒప్పుకుంటే తాను కూడా సినిమా చేయడానికి సిద్ధం అంటూ ఇటీవల కృష్ణవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈయన స్టార్ హీరోతో సినిమా అంటే ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన మురారి సినిమా( Murari Movie ) తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కృష్ణవంశీ ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు.ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఈయనని ప్రశ్నిస్తూ.
గతంలో రామ్ చరణ్ కి చేసిన ప్రామిస్ గురించి ప్రశ్నించారు.
రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ గోవిందుడు అందరివాడే సినిమా చేశారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన దీంతో తప్పనిసరిగా రామ్ చరణ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు గుర్తుందా అంటూ ప్రశ్నించారు.దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ.
ఉంది.రాంచరణ్ ఎప్పుడు రెడీ అంటే నేను కూడా రెడీనే.
ధన్యవాదాలు.సూపర్ ఐడియా, స్క్రిప్ట్ సిద్దంగా ఉంది.
టైం నిర్ణయిస్తుంది సార్.అంటూ రిప్లై ఇచ్చాడు.
మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయంపై అభిమానులు కూడా చర్చలు జరుపుతున్నారు.