గ్రీకు వీరుడు ది గ్రేట్ అలెగ్జాండర్( The Great Alexander ) గురించి ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ పేరు వినగానే ఆయన పరాక్రమం గుర్తుకు వస్తుంది.ఇక జగజ్జేతగా ఆయన చరిత్రపుటల్లోకి ఎక్కారు.12 ఏళ్లకే అదుపు తప్పిన గుర్రానికి కళ్లెం వేసిన మహా వీరుడు అని చరిత్ర చెబుతోంది.బుసెఫాలస్ అనే ఆ అడవి గుర్రం అలెగ్జాండర్ కు జీవితాంతం తోడుగా ఉండిపోయిందట.నూనూగు మీసాల ప్రాయంలోనే తండ్రి మరణంతో 20ఏళ్లకే రాజు అయ్యాడు.ఆ తరువాత ఎన్నో రాజ్యాలు జయించాడు.అలా వరుస విజయాలు వరించడంతో ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఆ యువకుడిలో బలంగా నాటుకుపోయింది.
ఆ కాంక్షతోనే అఖండ సైన్యంతో ఎన్నో రాజ్యాలను జయించి హస్తగతం చేసుకోవడం జరిగిందని చరిత్ర చెబుతోంది.

ఈ క్రమంలో ఈజిప్ట్, గ్రీస్, ఇరాన్, ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వరకు రాజ్యాన్ని విస్తరించాడు.అలెగ్జాండర్ దృష్టి పెట్టిన రాజ్యం బతికిబట్టకట్టలేదు.అతని పరాక్రమం గురించి అప్పట్లో కోకొల్లలుగా మాట్లాడుకునేవారు.
సైన్యం విషయంలో అలెగ్జాండర్ కి తిరుగులేదు.ఈ నేపథ్యంలో ఒకానొక క్షణంలో అఖండ భారత్ ను కూడా జయిస్తే ఇక జగజ్జేత తానే అనుకున్నాడు అలెగ్జాండర్.
అనుకున్నదే తడవుగా అఖండ సైన్యంతో క్రీ.పూ.326వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారత్ సరిహద్దులకు చేరాడు.కానీ భారత్ శక్తివంతమైన దేశమని తెలుసుకొని శ్రేయోభిలాషుల సలహా మేరకు కొంతకాలం వేచి ఉన్నాడు.

ఈ క్రమంలో అలెగ్జాండర్ ను తక్షశిల రాజు అంబి వచ్చి కలిసి సింది చేసుకున్నాడు.కారణం ఏమిటంటే అంభి అలెగ్జాండర్ ను పాంచాలపై దండెత్తాలని కోరుతాడు.అంబి పొరుగు రాజ్యం పాంచాల (ఇప్పటి పంజాబ్) రాజ్యానికి రాజు ‘పురుషోత్తముడు.’ అలా క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తాడు అలెగ్జాండర్.ఈ క్రమంలో బాక్ట్రియా (ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్)కు చెందిన యువరాణి ‘రోక్సానా’ను పెళ్లాడతాడు.ఆ వివాహాన్ని అడ్డు పెట్టుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అనుకుంటాడు.
అయితే పురుషోత్తముడి పరాక్రమం గురించి తెలిసిన అలెగ్జాండర్ భార్య రోక్సానా తెలివిగా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది.రాఖీ కట్టినందుకు సంతషించిన పురుషోత్తముడు రోక్సానాను తన సొంత చెల్లి అంటూ ప్రకటిస్తాడు.
ఇక రాఖీ కట్టిన చెల్లికి కోరిక మేరకు కదనరంగంలో అలెగ్జాండర్ తలని నరకకుండా పురుషోత్తముడు వదిలేస్తాడు.అలా రాఖీ వల్ల ఆ యుద్దం అక్కడితో ఆగిపోయింది.
ఇక అప్పటి వరకు జగజ్జేతగా వెలుగొందిన అలెగ్జార్ పురుషోత్తముడి చేతిలో ఓటమిపాలయ్యాడు.