ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం అయ్యారు.
రాహుల్ గాంధీతో దాదాపు 50 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగింది.ఈ సందర్భంగా రేవంత్ ను రాహుల్ గాంధీ అభినందించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసిన రేవంత్ రెడ్డి వారిని కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
అయితే రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం జరగనున్న సంగతి తెలిసిందే.