స్కాట్లాండ్కు ( Scotland )సుందరమైన పశ్చిమ తీరంలో యుయిస్ట్, బెన్బెకులా హెబ్రిడియన్ దీవులు ఉంటాయి.చాలా మంది ప్రజలు ఈ దీవుల్లో ఉండిపోవాలని కలలు కంటారు.
అంత అందంగా అవి ఉంటాయి మరి.ఈ వేసవిలో ఈ దీవులు కేవలం పర్యాటకులను ఆహ్వానించడమే కాకుండా వైద్యులకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాన్ని కూడా అందిస్తున్నాయి.
లోకల్ హెల్త్ సర్వీస్ NHS వెస్ట్రన్ ఐల్స్,( NHS Western Isles ) సాహసం, గ్రామీణ ఆరోగ్య సంరక్షణపై ప్రేమతో కొత్త వైద్యులను నియమించాలని చూస్తోంది.ఈ సంస్థ 150,000 పౌండ్ల జీతం అందిస్తుంది.అంటే దాదాపు 1.5 కోట్ల రూపాయలు. యూకేలోని పట్టణ ప్రాంతాల్లో వైద్యులు సాధారణంగా సంపాదించే దాని కంటే ఇది 40% ఎక్కువ.ఔటర్ హెబ్రైడ్స్లోని ఆరు అందమైన ద్వీపాలలో కమ్యూనిటీని చూసుకోవడం ఈ డాక్టర్ల బాధ్యత.
కొత్త వైద్యులకు 10,000 పౌండ్లు (సుమారు 10 లక్షల రూపాయలు) ఎక్స్ట్రా బోనస్ కూడా అందజేస్తారు.NHS వెస్ట్రన్ ఐల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, గోర్డాన్ జామీసన్ BBC ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రకమైన పని, జీవనశైలి కోసం ఆసక్తిగా ఉన్న వైద్యుల కోసం చూస్తున్నామని పేర్కొన్నారు.ఇది అందరికీ సరిపోని ప్రత్యేకమైన పాత్ర, అందుకే వారు అలాంటి పెద్ద ప్యాకేజీని అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది మరింత మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వైద్య నిపుణులను( Medical Professionals ) కనుగొనే ప్రయత్నంలో భాగం.ఐలాండ్ సమాజంలో భాగం కావడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులను కనుగొనడం కూడా దీని లక్ష్యం.బయటి ప్రాంతాల వారికి, ప్రత్యేకించి తీర ప్రాంతాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
అదనంగా, స్కూల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి.స్థానిక పాఠశాల కొత్త ప్రిన్సిపాల్, టీచర్ కోసం వెతుకుతోంది.ప్రపంచంలోని అత్యంత సుందరమైన ప్రాంతాల్లో నివసించడానికి, పని చేయడానికి నిపుణులకు ఇది ఒక అవకాశం.