మన దేశంలో మంగళ సూత్రంకు ఎంతో ప్రాధాన్యత ఉందనే సంగతి తెలిసిందే.హిందూ సంప్రదాయంను పాటించే వాళ్లకు పెళ్లి వేడుకల్లో మాంగల్య ధారణ ముఖ్యమైనది కాగా మంగళ సూత్రాన్ని తాళి, తాళిబొట్టు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.
పెళ్లైన స్టార్ హీరోయిన్లలో ఒక్కో హీరోయిన్ ఒక్కో డిజైన్ లో ఉండే మంగళ సూత్రాన్ని ధరించారు.టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా గుర్తింపును సంపాదించుకున్న ప్రియాంక చోప్రా బంగారు పూసలు, నల్ల పూసలు ఉన్న తాళిబొట్టును ధరించారు.
స్పెషల్ గా డిజైన్ చేయబడిన మంగళసూత్రంను ప్రియాంక చోప్రా ధరిస్తున్నారు.రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న దీపికా పదుకొనే డైమండ్ చైన్ లాంటి మంగళసూత్రం ధరించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రెండు లైన్స్ నల్లపూసలు ఉన్న మంగళసూత్రాన్ని ధరించారు.మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సింగిల్ డైమండ్ చైన్ లాంటి మంగళసూత్రం ధరిస్తూనే మెడలో వజ్రాలు ఉన్న మరో చైన్ ను కూడా ధరిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ చైన్ లో పెండెంట్ ఉండే మంగళసూత్రాన్ని ధరించారు.అమితాబ్ కొడుకు, అభిషేక్ ను ఐశ్వర్యా రాయ్ పెళ్లి చేసుకున్నారన్న సంగతి తెలిసిందే.నెల రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ ను పెళ్లి చేసుకున్న యామీ గౌతమ్ చైన్ రూపంలో ఉండే పెండెంట్ ను కలిగి ఉన్న మంగళ సూత్రంను ధరిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సంప్రదాయకంగా ఉండే మంగళసూత్రంను ధరిస్తున్నారు.