భారతీయ మహిళలు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు.వారు ఎలాంటి సమస్యకైనా చిటికెలో పరిష్కారం చూపిస్తుంటారు.
వారి పరిష్కారాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇప్పుడు అలాంటి ఓ వీడియో ట్విట్టర్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.“NBT హిందీ న్యూస్” ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను పంచుకుంది.వైరల్ అయిన వీడియో ప్రకారం, ఓ ట్రైన్ ఏసీ కోచ్‌లో (train AC coach)ఒక తలుపు బాగా డామేజ్ అయింది.
దానికి రబ్బరు కూడా లేకపోవడం వల్ల తలుపు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు భారీ శబ్దం చేస్తోంది.ఈ శబ్దం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన సహ ప్రయాణికుల సహాయంతో ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు.వారు తలుపుకు ఒక దిండును అడ్డుపెట్టి శబ్దాన్ని తగ్గించారు.
దీంతో ప్రయాణం చాలా సౌకర్యంగా మారింది.ఆ మహిళ తాను ఎలా ఈ సమస్యను పరిష్కరించిందో వీడియోలో వివరించారు.
ఈ వీడియో ఒక వైపు ప్రయాణికుల సృజనాత్మకతను ప్రదర్శిస్తూనే, మరోవైపు భారతీయ రైల్వేల(Indian Railways) నిర్వహణలోని లోపాలను బహిర్గతం చేస్తోంది.ఈ వీడియోలోని సంఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.కొందరు ప్రయాణికుల చాకచక్యతను అభినందిస్తూ ఉంటే, మరికొందరు రైళ్ల దుస్థితిని తప్పుబడుతున్నారు.కొంతమంది రైల్వే ఆస్తిని దెబ్బతీయడం నేరం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ రైల్వే అధికారులను తప్పుబడుతున్న వారు కూడా ఉన్నారు.
“బుల్లెట్ ట్రైన్లు తీసుకురాక ముందు పాత రైళ్లను సరి చేయండి” అని ఒక నెటిజన్ అంటే, “మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి అయితే ఫస్ట్ ఏసీలో ప్రయాణించాలి కదా” అని మరొకరు వ్యాఖ్యానించారు.“ఆంటీ శరీరం రైలులో ఉంది కానీ ఆత్మ ఇంట్లోనే ఉంది.ఇంట్లో రిపేర్లు చేసినట్లు రైలులో కూడా చేస్తుంది” అని మరొకరు సరదాగా అన్నారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.