అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు.యూత్‌లో యమ క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరో అనే విషయం తెల్సిందే.తెలుగులో ఈయన యంగ్ హీరోల్లో నెం.1 గా దూసుకు పోతున్నాడు.ఇదే సమయంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ కూడా ఓ రేంజ్‌లో వెళ్తున్నాడు.అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈయన హిందీలో వరుసగా సినిమాలు చేసేందుకు ఛాన్స్ దక్కించుకుంటున్నాడు.
సందీప్ రెడ్డితో వరుసగా రెండు సినిమాలను నిర్మించేందుకు టీ సిరీస్ సంస్థ భారీ ఒప్పందం చేసుకుంది.
ప్రస్తుతం ఈయన రెండవ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.రణ్‌వీర్ సింగ్ హీరోగా ఈయన తదుపరి చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
మొన్నటి వరకు ఈయన తదుపరి చిత్రం తెలుగులో ఉంటుందని అన్నారు.తెలుగులో ప్రస్తుతం ఈయన సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని ఆ వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది.

తెలుగులో కాకుండా మళ్లీ హిందీలోనే సందీప్ రెడ్డి వంగ సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో కొత్త సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాను టీ సిరీస్‌తో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు ప్రణయ్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.