నేటికి మార్కెట్లోకి ఎన్ని బ్రాండ్లు స్మార్ట్ ఫోన్లు వచ్చినా నోకియాకి వున్న స్థానం వేరు.ఇప్పటికీ ఆన్లైన్, ఆఫ్ లైన్ మార్కెట్లో మనకి నోకియా బేసిక్ ఫోన్లనుండి 2660 ఫ్లిప్ ఫోన్లు కనబడుతూనే వుంటాయి.
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాటిని వాడుతూనే వుంటారు.ఇక చాలామంది వాటిని సెంటిమెంట్ గా కూడా ఫీల్ అవుతారు.సాధారణంగా 2660 ఫ్లిప్ ఫోన్లు( Flip Phones ) అనేవి బ్లాక్, రెడ్, బ్లూ అనే మూడు విభిన్న రంగులలో రూ.4,699కి అందుబాటులో మనకి లభిస్తాయి.ఈ ఫోన్ కావాలనుకొనేవారు నోకియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా లేదా రిటైల్ షోరూమ్, ఆన్‌లైన్‌లో కొనుక్కుంటున్నారు.

అయితే తాజాగా నోకియా UPI స్కాన్, పే ఫంక్షనాలిటీని, తన క్లాసిక్ మోడల్ నోకియా 2660 ఫ్లిప్ ఫోన్( Nokia 2660 Flip Phone )లో ప్రవేశ పెట్టింది.దీని ద్వారా, వినియోగదారులు ఒకే బటన్ నొక్కడం ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన డిజిటల్ లావాదేవీలు చాలా తేలికగా చేయవచ్చునని సమాచారం.ఇక 2660 ఫ్లిప్ కొత్త ఫోన్ కొనేవారికి ఈ ఫీచర్ ఇన్‌బిల్ట్ గా వస్తుంది.
ఐతే, పాత వినియోగదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్( Software Update ) చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ని పొందవచ్చునని సమాచారం.కాబట్టి ఈ విషయాన్ని పాత వినియోగదారులు గమనించగలరు.
సాఫ్ట్ వేర్ అప్‌డేట్ ద్వారా డిజిటల్ చెల్లింపు ఆప్షన్లు అందరికీ అందుబాటులో ఉండేలా చేసింది కంపెనీ.

దాంతో వినియోగదారులు ఫుల్ ఖుషీ.ఇకపోతే నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ క్లాసిక్‌ని తగినంత మన్నికైన స్టైలిష్ డిజైన్‌లో విడుదల చేశారు.ఇక నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ఫీచర్లు( Nokia 2660 Flip Phone Features ) ) చూస్తే, ఈ ఫోన్ 2.8 అంగుళాల డిస్‌ప్లే, చక్కటి సౌండ్ సిస్టమ్ కలిగి వుంది.అదనంగా, 1450mAh బ్యాటరీ కలిగివుంది.
ఈ బ్యాటరీని తొలగించుకోవచ్చు కూడా.ఈ ఫోన్‌లో ఎమర్జెన్సీ బటన్ ఆప్షన్ ఉంది.
దాని ద్వారా 5 ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లను స్టోర్ చేసుకొనే వీలుంది.అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కడం ద్వారా.
ఆ ఐదుగురికీ మీరు ఆపదలో ఉన్న సమాచారం వెళ్తుందన్నమాట.ఈ ఫోన్ అంతరాయం లేని నెట్‌వర్క్ ను అందించడానికి VoLTE సపోర్ట్‌తో డ్యూయల్ 4G కనెక్టివిటీ కలిగివుంది.
ఇక ఫంక్షనాలిటీ విషయానికొస్తే, మైక్రో SD కార్డ్‌లు, స్టోరేజ్‌ని పెంచుకునే ఆప్షన్లు ఉన్నాయి.ఇంకా ఈ నోకియా ఫోన్‌కి VGA కెమెరా ఉండగా, FM రేడియో సపోర్ట్ కూడా ఉంది.