డబ్ల్యూపీఎల్ లో(WPL) బెంగళూరు జట్టు వరుసగా ఐదు పరాజయాలను ఖాతాలో వేసుకుని లీగ్ పాయింట్లలో చివరి స్థానంలో నిలిచింది.చూడడానికి టీమ్ లో మొత్తం స్టార్ ప్లేయర్ లే.
కానీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్లలో ఫీల్డింగ్ బాగా చేస్తే బ్యాటింగ్లో విఫలం.
బ్యాటింగ్ బాగా చేస్తే ఫీల్డింగ్ లో విఫలం కారణంగా జట్టు ఘోర ఓటములను చవిచూస్తోంది.పాపం జట్టు కెప్టెన్ స్మృతి మందాన(Smriti mandanna) ముఖంలో చిరునవ్వు దూరమైంది.
మందాన బ్యాటింగ్లో చిలరేగితే గెలుపుకు తిరుగు ఉండదు.ఒకరకంగా కెప్టెన్సీ భారాన్ని మందాన మోయలేక పోతుందనే చెప్పాలి.
మరోపక్క జట్టు ప్లేయర్లంతా సమిష్టిగా రాలేకపోవడం కూడా ఒక కారణమే.
తాజాగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు ఓటమిపాలైంది.చివరి ఓవర్ లో 9 పరుగుల డిఫెండ్ చేయలేక ఐదవ ఓటమిని ఖాతాలో వేసుకుంది.అయితే లీక్ పాయింట్లలో చివరి స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు(Royal Challengers Bangalore) మూడవ స్థానం చేరుకోవడానికి ఇంకా అవకాశం మిగిలే ఉంది.
బెంగళూరు జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఈ మూడు మ్యాచ్లలో వరుస విజయాలను అందిపుచ్చుకోవడం తో పాటు యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ విజయం సాధించాలి.
ఇంకా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ పై విజయం సాధించాలి.
ఇలా జరిగితే చివరి స్థానంలో ఉండే బెంగళూరు జట్టు మూడవ స్థానానికి చేరుతుంది.లీగ్ టేబుల్ లో రెండో స్థానంలో ఉండే జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే అవకాశం బెంగుళూరు జట్టుకు ఉంటుంది.ఇక్కడ కూడా విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది.
ఇక బెంగుళూరు జట్టు మార్చి 15న యూపీ వారియర్స్ తో, మార్చి 18న గుజరాత్ జెయింట్స్, మార్చి 21న ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.ఇప్పటివరకు జరిగిన పరిణామాల ప్రకారం బెంగుళూరు జట్టు సెమీఫైనల్ కు వెళ్తుందో లేదో చెప్పడం కష్టం.