అగ్ర రాజ్యం అమెరికాపై కరోనా ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అందరికి తెలిసిందే.లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది కరోన బారిన పడ్డారు.
వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.అయితే కరోనా కారణంగా ఏడాది పాటు మూతబడిన పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు, రెస్టారెంట్ లు అన్నీ ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డాయి.
దాంతో ఎంతో మంది అమెరికన్స్ ఉపాది కోల్పోవాల్సి వచ్చింది.దాంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఈ క్రమంలో
అమెరికా ప్రభుత్వం ఉద్యోగులను, వ్యాపారస్తులను ఆదుకునేందుకు పలు రకాల ప్రభుత్వ పధకాలను ప్రవేశపెట్టింది.అయితే ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయం, పధకాలను కొందరు దుర్వినియోగం చేస్తూ అడ్డంగా దొరికిపోగా దొరకని దొంగలు దర్జాగా తిరుగుతున్నారు.
తాజాగా కరోనా భాదిత వ్యక్తులకు ఆర్ధిక సాయం అందించిన అమెరికా ప్రభుత్వం ఈ డబ్బును దుర్వినియోగం చేసిన ఓ యువకుడిని గుర్తించి ఊచలు లెక్కపెట్టిస్తోంది.అమెరికాలో ఇలాంటి ఘటనలు లెక్కకు మించి నమోదు అవుతూనే ఉన్నాయి.
కరోనా కారణంగా జీవన ఉపాది కోల్పోయి, రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకునే క్రమంలో అమెరికా ప్రభుత్వం పే చెక్ ప్రొటక్షన్ ప్రోగ్రామ్ పేరుతో అమెరికన్స్ ను ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రణాలికలు సిద్దం చేసింది.ఈ పధకం ద్వరా కొంత మొత్తాన్ని వ్యాపార, వ్యక్తిగత, పలు సంస్థల నిర్వహణకు అందిస్తారు. లీ అనే వ్యక్తి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ బ్యాంక్ ద్వారా దాదాపు రూ.12 కోట్లు లోను పొందాడు.బ్యాంక్ నుంచీ అందిన సొమ్ముతో ఖరీదైన కార్లు, డైమండ్స్ తో పొదిగిన వాచ్చీ లు కొనుగోలు చేశాడు.ఈ విషయాన్ని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా తీగ లాగితే డొంక కదిలినట్టుగా లీ పలు బ్యాంక్ లను మోసం చేసి ఈ పెద్ద మొత్తం కాజేసినట్టుగా గుర్తించారు.
దాంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా కోర్టు అతడికి 9 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.