తులసి( basil ) ఉపయోగం ఆయుర్వేదంలో ఎక్కువగా ఉంటుందని దాదాపు చాలా మందికి తెలుసు.తులసి మొక్క, దీని కాండం, ఆకులు, వేర్లు మరియు గింజలు అన్నీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో దాదాపు చాలా మంది ఇళ్లలో తులసిని పూజిస్తారు.మత విశ్వాసాల ప్రకారం తులసిని క్రమం తప్పకుండా పూజించడం అదృష్టం యొక్క తలుపులు తెరుస్తుంది.
అంతే కాకుండా ఇంట్లో వ్యాపించిన దరిద్రం కూడా దూరం అవుతుంది.

పండితులు చెప్పిన దాని ప్రకారం తులసి మంజర్( Tulsi Manjar ) యొక్క సరలమైన మరియు జ్యోతిష్య శాస్త్రపరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి తులసి మొక్కను ఇలా ఉపయోగించాలి.ముఖ్యంగా చెప్పాలంటే తులసి మహావిష్ణువు( Lord Vishnu ) కు ఎంతో ఇష్టమైనది అని చాలామంది ప్రజలు నమ్ముతారు.
విష్ణువు పూజలో తులసిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం మహా విష్ణువుకు తులసి ఆకులను నైవేద్యంగా పెడితే ఎన్నో సంవత్సరాలుగా కూరుకుపోయిన డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది.జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు కూడా సంపద పెంచుకోవాలి అనుకుంటే తులసి నీ ఎర్రటి గుడ్డలో చుట్టి మీ ఇంటి ఖజానాలో లేదా సంపద ఉన్న ప్రదేశంలో ఉంచాలి.ఈ పరిహారంతో లక్ష్మీమాత అనుగ్రహం( Lakshmi Mata ) ఎప్పుడు ఉంటుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడు ప్రతికూల వాతావరణం లేదా మానసిక ఒత్తిడి ఉంటే దాన్ని దూరం చేసుకోవడానికి గంగాజలం తులసి ఆకులు కలిపి ఇంటికి ఉత్తర దిశలో ఉంచి ఆ నీటిని చల్లాలి.
ప్రతి రోజు ఇల్లు అంతట ఇలా చేయడం వల్ల ఇంట్లోనీ నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.అలాగే ఇంటి వాతావరణం ఆరోగ్యంగా మారుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే మాత లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పూజ సామాగ్రిలో తులసి నీ ఉపయోగించినట్లయితే అది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.అలాగే శుక్రవారం రోజు లక్ష్మి దేవికి తులసి నీ కచ్చితంగా సమర్పించాలి.
ఈ పరిహారంతో లక్ష్మీదేవి అనుగ్రహం మీ పై, మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉంటుంది.