ప్రీవెడ్డింగ్ షూట్‌లో షాక్.. ఫొటోలు దిగడం నేర్పిన తాత

Shock In The Pre-wedding Shoot.. Grandfather Who Taught Me How To Take Photos , Pre Wedding Shoot, Viral Latest, News Viral, Social Media, Viral Video, Dance, Old Man

పెళ్లిళ్ల సీజన్‌ మొదలవగానే జంటలు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌‌లలో పాల్గొంటున్నారు.సెలబ్రిటీల నుంచి మధ్య తరగతి ప్రజల వరకు అంతా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

 Shock In The Pre-wedding Shoot.. Grandfather Who Taught Me How To Take Photos ,-TeluguStop.com

ఫొటోగ్రాఫర్లు కూడా దీనిని మంచి వ్యాపార అవకాశంగా మలచుకుంటున్నారు.పెళ్లికి ముందు ప్రజలలో ప్రీ-వెడ్డింగ్ షూట్‌లకు చాలా క్రేజ్ ఉందని, ప్రతి ఒక్కరూ మంచి లొకేషన్‌లో ఫోటోషూట్ చేయాలనుకుంటున్నారు.

ఈ రోజుల్లో ఫోటోషూట్‌లు చాలా ఖరీదైనవిగా మారాయి.ఎందుకంటే పెద్ద బృందం ఉండటం వల్ల, ఫోటోగ్రాఫర్‌లు తదనుగుణంగా వసూలు చేస్తున్నారు.

మంచి మంచి లొకేషన్లలో ఫొటోషూట్ చేస్తుంటారు.ఇదే కోవలో ఓ జంట ఫొటోషూట్‌కు వెళ్లింది.

అయితే అక్కడ జంటతో పాటు, ఫొటోగ్రాఫర్లను ఓ తాత ఆశ్చర్యపరిచాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఫొటోషూట్‌ల సమయంలో స్టిల్స్ అలా చేయాలి ఇలా చేయాలని ఫొటోగ్రాఫర్లు చెబుతుంటారు.రకరకాల స్టిల్స్ తో వధూవరులను ఫొటోలు తీస్తుంటారు.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో జంట పడవపై ఫొటోషూట్ చేస్తుంటారు.ఆ పడవను ఓ తాత నడుపుతుంటాడు.ఫొటో షూట్ సమయంలో స్టిల్స్ ఇలా దిగండి అంటూ అతడే గైడెన్స్ ఇచ్చాడు.

దీంతో ఆ కొత్త జంటతో పాటు ఫొటోగ్రాఫర్లు కూడా షాక్ అయ్యారు.అతడిలో టాలెంట్ చూసి అంతా కంగుతిన్నారు.ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగానే బాగా వైరల్ అవుతోంది.

ఆ తాతలో చాలా టాలెంట్ ఉందని, రొమాంటిక్ సన్నివేశాలు బాగా అర్ధం చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అవకాశాలు రాక కేవలం పడవ నడుపుకుంటున్నాడని, సినిమాలలోకి వచ్చి ఉంటే డైరెక్టర్ రాఘవేంద్రరావును మించిపోయేవాడని పేర్కొంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube