బంద్ తర్వాత షూటింగులలో సందడి చేస్తున్న స్టార్స్ వీరే!

టాలీవుడ్ లో ఆగష్టు నెల మొత్తం షూటింగులు జరుగక సందడి లేకుండా పోయింది.గత నెల అంతా నిర్మాతల బంద్ కారణంగా 24 క్రాఫ్ట్స్ వారు ఖాళీగా కనిపించారు.

 Telugu Cinema Shooting To Resume, Telugu Cinema Shooting, Tollywood, Tollywood H-TeluguStop.com

మరి టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలను నిర్మాతల బృందం చాలా వరకు పరిష్కరించడంతో సెప్టెంబర్ 1 నుండి షూటింగులు యథావిథిగా జరుగుతున్నాయి.

దీంతో మళ్ళీ ఒక్కొక్కరిగా షూటింగ్ లను స్టార్ట్ చేస్తున్నారు.

మరి బంద్ తర్వాత ప్రెజెంట్ ఎవరెవరు షూటింగ్ స్టార్ట్ చేసి బిజీగా ఉన్నారో తెలుసుకుందాం.మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఇందులో మహేష్ కూడా జాయిన్ కాబోతున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి గత రెండు రోజుల క్రితమే బాబీ సినిమాలో జాయిన్ అయ్యాడు.

అలాగే రామ్ చరణ్ మరియు శంకర్ సినిమా కూడా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ప్రభాస్ సలార్ షూటింగ్ కూడా రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతుంది.

ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి.

Telugu Allu Arjun, Balakrishna, Chieranjeevi, Prabhas, Ram Charan, Telugu, Telug

అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ NTR30 సినిమాలు మరి కొద్దీ రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నాయి.బాలయ్య కూడా తన 107వ సినిమా సెట్ లో జాయిన్ అయినట్టు టాక్.ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇలా పెద్ద హీరోలు అందరు కూడా షూటింగులకు సిద్ధం అవుతుండడంతో టాలీవుడ్ లో మళ్ళీ సందడి వాతావరణం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube