మహేష్, వెంకటేష్, నాగ్.. ఎక్కడికి వెళ్లినా ఒకే ప్రశ్న?

నాగార్జున వెంకటేష్, మహేష్ బాబు ఈ ముగ్గురు హీరోలు ఎక్కడికి వెళ్ళినా అటు మీడియా నుంచి ఎదురవుతుంది ఒకే ఒక ప్రశ్న ఇక ఇప్పుడు ఆ ప్రశ్న కామన్ గా మారిపోయింది.సాధారణంగా కాస్త వయసొచ్చిన హీరోయిన్లను మీ పెళ్ళెప్పుడు అని ప్రతి చోట అడుగుతూ ఉంటారు కదా.

 Tollywood Legends And Their Biopics Venkatesh Nagarjuna Mahesh Babu Details, Tol-TeluguStop.com

ఇక ఈ ముగ్గురు హీరోలకు కూడా ఇలాంటి ఒక ప్రశ్న ఎదురవుతోంది.ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో తెలుసా.

మీ నాన్న గారి బయోపిక్ ఎప్పుడు.ఒకవేళ బయోపిక్ తీస్తే మీరు తప్పకుండా నటిస్తారా అంటూ అడుగుతున్నారు.

ఇదే సమయంలో ఇప్పుడు సరికొత్త ప్రశ్న కూడా తెర మీదికి వస్తుంది.ఒకవేళ అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు ,సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారి బయోపిక్ లు తెరకెక్కిస్తే ఆ సినిమాలలో కేవలం వాళ్ళ వారసులు మాత్రమే నటించాలా ఇతరులు నటిస్తే పాత్రలు పండవా అని కూడా చర్చించుకుంటున్నారు కొంతమంది.

అయితే ఇటీవలే సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబుకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది.మీ నాన్న గారి బయోపిక్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

మీ నాన్నగారి పాత్రలో నటించాలని మీకు ఉందా అంటూ అడుగగా… మా నాన్న నాకు దేవుడితో సమానం.ఆయన బయోపిక్ చేస్తే ఒక అభిమానిగా ఆ సినిమా చూడటానికి సిద్ధంగా ఉంటాను.

కానీ ఆయన పాత్రలో నటించలేదు చెప్పాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇక మహేష్ బాబు చెప్పిన ఆన్సర్ తో మీడియా కి మరో ప్రశ్న అడిగేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది.

Telugu Fathers Bio, Rama, Mahesh Babu, Tollywood Bio-Movie

అదే సమయంలో ఇటీవలే ఎఫ్ 3 ప్రమోషన్స్ లో ఉన్న విక్టరీ వెంకటేష్ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది.తండ్రి రామానాయుడు బయోపిక్ తీస్తే మీరు నటిస్తారా అంటూ అడగ్గా ఇక ఈ సినిమా తీసేందుకు ఎవరైనా డైరెక్టర్ నన్ను కలిస్తే తప్పకుండా నాన్న గారి బయోపిక్ తీస్తాను అంటూ వెంకటేష్ సమాధానం చెప్పారు.

Telugu Fathers Bio, Rama, Mahesh Babu, Tollywood Bio-Movie

ఇక అక్కినేని నాగార్జునకు అయితే ఎన్నో రోజుల నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురవుతూనే ఉంది.అక్కినేని బయోపిక్ ఎప్పుడు రాబోతుంది.ఒకవేళ అక్కినేని బయోపిక్ వస్తే మీరు నటిస్తారా లేదా మీ కొడుకులకు మీ తండ్రి పాత్రలో నటించేందుకు అవకాశం ఇస్తారా అంటూ అడిగితే నాగార్జున మాత్రం మౌనంతోనే సమాధానం చెబుతున్నారు.చూస్తుంటే ఈ ముగ్గురి బయోపిక్ మాత్రం ఇప్పట్లో రావడం కష్టంగానే కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube