పవన్ కళ్యాణ్ పై లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్.. అది చెయ్యగలరా అంటూ?

సినీనటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్ర ప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు.ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విషవృక్షం నీడలో ఉన్నంతవరకు తాను ఎప్పుడూ ఎదగలేడని, తాను సొంతంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు మాత్రమే తను నాయకుడు కాగలరని ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్ చేశారు.

 Lakshmi Parvathi Shocking Comments On Janasena Party Chief Pawan Kalyan Details,-TeluguStop.com

కేవలం పది అడుగులు నడిచిన తరువాత ఎక్కువ జన సందోహం కనబడితేనే కారు ఎక్కే పవన్ కళ్యాణ్.జగన్ మాదిరి ప్రజలలో పాదయాత్ర చేయగలవా అంటూ ప్రశ్నించారు.

టిడిపి పార్టీతో కలిసి పని చేసిన టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపలేకపోయారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల పై తీసుకున్న నిర్ణయం కేవలం తన సొంత నిర్ణయం కాదని, చిరంజీవి నాగార్జున పలువురు నిర్మాతలను సంప్రదించి వారి నిర్ణయం ప్రకారమే ఆన్లైన్ టికెట్ విధానం అమలు పరచారని ఈ సందర్భంగా లక్ష్మిపార్వతి తెలియజేశారు.

Telugu Ap Cm Jagan, Janasena, Lakshmiparvathi, Pawan Kalyan, Teluguakademy, Toll

సరైన మార్గంలో టికెట్లను అమ్ముతుంటే ఒక నాయకుడిగా ఉండి దొంగ టికెట్ల అమ్మకాలకు ప్రోత్సహించే నీవు మంచి నాయకుడు ఎలా అవుతావ్ అంటూ లక్ష్మీపార్వతి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక నాయకుడిగా ఉన్నవారు ఎవరు మంచి చేసినా అది మంచిగానే మాట్లాడాలి కానీ జగన్ ఏం తప్పు చేశారని తనని ప్రశ్నిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube