ఖమ్మం జిల్లా హర్యాతండాలో( Haryatanda ) చోటు చేసుకున్న కారు ప్రమాదం ఘటనలో ట్విస్ట్ నెలకొంది.భార్యతో పాటు ఇద్దరు పిల్లలను భర్త ప్రవీణ్( Praveen ) చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు చెబుతున్నారు.వేరే మహిళతో ప్రవీణ్ వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను హత్య చేశాడని మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు.భర్త ప్రవీణ్ ను ఉరి తీయాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు.