మెటా కంపెనీకి చెందిన వాట్సప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది.ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకుని వచ్చి మరింత సెక్యూరిటీ పరంగా బలోపేతం చేస్తూ అనేక సదుపాయాలన్ని కలిగిస్తుంది వాట్సప్.
ఇందులో భాగంగానే కొత్తగా చాట్ ఫిల్టర్ తో పాటు మరిన్ని సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.విడితోపాటు ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్ఫారంలో ఈ మధ్యకాలంలో ఏఐ జనరేటర్ ప్రొఫైల్ పిక్చర్ అలాగే.
చదివినవి, చదవనివి మెసేజ్ సెపరేట్ చేసే ఆప్షన్ల ఫీచర్లను కూడా తీసుకోచ్చిన సంగతి తెలిసిందే.

ఇదివరకు వాట్సాప్ లో వినియోగదారులు స్టేటస్ పెట్టేందుకు కేవలం 30 సెకండ్ల వీడియో మాత్రమే నిడివి ఉండేది.అయితే ప్రస్తుతం వాయిస్ నోట్స్ ని ఒక్క నిమిషం వరకు దీనిని పెంచింది.ఇందుకోసం అప్డేట్ పేజీలో మైక్రోఫోన్ చిహ్నాన్ని నొక్కి పట్టి వాయిస్ వినిపించాల్సి ఉంటుంది.
ఒక్క నిమిషం నిడివి గల వాయిస్ మెసేజ్లను ఇందులో స్టేటస్ గా పెట్టుకోవచ్చు.ఒక్కొక్కసారి ఒక్కో అప్డేట్ ని మాత్రమే ఇస్తున్న వాట్సాప్ కాబట్టి ఎప్పటికప్పుడు వాట్సప్ అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫ్యూచర్ ని పొందవచ్చు.

ఈ వాట్సాప్ గతంలో వీడియో కాల్స్ లో స్క్రీన్ షేరింగ్ సమయంలో ఫోన్ ఆడియో అవతల వారికి వినిపించే ఆప్షన్ లేకుండా ఉండేది.కాకపోతే ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ లో స్క్రీన్ షేరింగ్ సమయంలో వీడియో తో పాటు ఆడియోని కూడా ప్లే చేసే విధంగా కొత్త అప్డేట్ ని తీసుకవచ్చింది.దీంతోపాటు యూజర్ ఇంటర్ ఫేస్ కి సంబంధించిన విషయాలను మెరుగుపరిచేందుకు కొత్త ఐకాన్సును కూడా అందులో జోడించింది.అలాగే వాట్సప్ పాస్ కి ఫీచర్ మరింత భద్రతను కలిపిస్తుడనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈమధ్య ఐఓఎస్ లో రోలోటైన ఈ ఫీచర్ ఆరు నెలల తర్వాత ఆండ్రాయిడ్ వినియోగదారులకు రాబోతుంది.ప్రస్తుతం ఈ పాస్ కీలు కేవలం ఐఒఎస్ ఫోన్ లకు మాత్రమే అందుబాటులో ఉంది.