అమెజాన్( Amazon )లో ఆర్డర్ చేసిన ఓ ప్రొడక్ట్‌ను రిటర్న్ చేసే విషయంలో తాను ఎదుర్కొన్న కష్టాలను కెనడాలో స్ధిరపడిన భారత సంతతికి చెందిన యువతి సోషల్ మీడియాలో పంచుకుంది.భారతదేశంలో అమెజాన్‌లో ఎవరికైనా ఆర్డర్ నచ్చకపోతే వెంటనే రిటర్న్ బటన్‌ను నొక్కవచ్చని.
పికప్ బాయ్ సంబంధిత ఉత్పత్తులను ఇంటి గుమ్మం వద్దకు వచ్చి తీసుకుంటారని సదరు యువతి ప్రశంసించింది.ఇందుకు ఒక్క పైసా కూడా ఖర్చు కాదని.
కానీ కెనడాలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్ధితులు నెలకొన్నాయని మండిపడింది.సెలీన్ ఖోస్లా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ‘అమెజాన్ ఇండియా vs కెనడా ’’ అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది.
అమెజాన్ ఇండియా వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే 30 రోజులలోపు రిటర్న్ చేయవచ్చని.కానీ కెనడా( Canada )లో ఆ పరిస్థితి ఉండదని ఖోస్లా( Selene Khosla ) పేర్కొంది.ఇక్కడ వస్తువును ప్యాక్ చేయాలి, లేబుల్‌ని ప్రింట్ చేయాలని అన్ని అవాంతరాలను దాటిన తర్వాత ఆ ప్యాక్‌ని దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి అందజేయాలని చెప్పింది.భారతదేశంలో పోస్టాఫీసులో పనిచేస్తున్న వ్యక్తులైనా సరే.పోస్టాఫీసుకు వెళ్లరని, కానీ కెనడాలో మాత్రం పోస్టాఫీసుకు వెళ్లాలని.ఇక్కడికైతేనే అమెజాన్ వస్తుందంటూ ఖోస్లా సెటైర్లు వేశారు.
అంతేకాదు .వేసవిలో ఎండ వేడిని పక్కనబెట్టి గూగుల్ మ్యాప్( Google Map )ను అనుసరించినా తాను పోస్టాఫీసును కనుగొనలేకపోయానని సెలీన్ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే గతంలో ఉన్న ఆఫీసును మరోచోటికి మార్చడంతో ఎట్టకేలకు పోస్టాఫీసును గుర్తించగలిగింది.
ప్యాకెట్‌ను ఓ అమ్మాయికి ఇచ్చి ఆమెతో ‘‘ ఇండియాలో రిటర్న్ ఎలా తీసుకుంటారా తెలుసా ’’ అని ప్రశ్నించింది.అక్కడ చిన్న షాంపూ బాటిల్ ఆర్డర్ చేసినా వాళ్లే వచ్చి తీసుకెళ్తారు .ఎందుకంటే మనం అభివృద్ధి చెందినవాళ్లం కదా అంటూ సెలీన్ చురకలంటించింది.ఈ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.దీనిపై స్పందించిన సినీనటి పారుల్ గులాటి ‘‘మేరా భారత్ మహాన్ ’’ అంటూ కామెంట్ చేసింది.
అయితే అమెజాన్ ఇంటర్నేషనల్ రిటర్న్ పాలసీ ప్రకారం.కొన్ని దేశాల నిబంధనలను అనుసరించి ఇంటి నుంచి రిటర్న్‌లు తీసుకునే వెసులుబాటు లేదు.