తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.? లేనట్టా.? అని ట్విట్టర్ ఎక్స్ వేదికగా నిలదీశారు.విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలని కేటీఆర్ ప్రశ్నించారు.పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ అని నిలదీశారు.ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేదన్న కేటీఆర్ నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేవాడు లేడని విమర్శించారు.నేడు విత్తనాలు కొందామంటే అమ్మేవాడు లేడన్నారు.
పాలన పూర్తిగా పడకేసిందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.
.