ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల యాక్సిడెంట్ సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉన్నాం.ప్రధాన కూడళ్లలో ఉన్న సిసిటీవీల ద్వారా అనేక యాక్సిడెంట్ సంబంధించిన ఘటనల వీడియోలు ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా మరో యాక్సిడెంట్ సంబంధించిన వీడియో పుస్తకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఢిల్లీలోని నోయిడాలో( Noida, Delhi ) జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారింది.
సెక్టార్ 53 విధుల్లో ఓ 64 ఏళ్ల వ్యక్తి ఇంటి కోసం పాల్గొనడానికి బయటకు వెళ్లిన ఆ వ్యక్తిని గుర్తుతెలియని తెల్లటి కారు ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో జనక్ దేవ్( Janak Dev ) అనే 64 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు.
వృద్ధుడు రోడ్డు దాటుతుండగా వేగంగా ఎదురుగా వచ్చిన తెల్లని కారు ఒక్కసారిగా అతడి మీదుగా వెళ్ళగా.ఆ వ్యక్తి అమాంతం గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు.

ఈ దుర్ఘటనకు సంబంధించి జనక దేవ్ కుటుంబ సభ్యులు పోలీసులు కు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి కేసును నమోదు చేయించారు.పోలీసులు కూడా ఈ సీసీటీవీ పరిశీలించి కేసును దర్యాప్తు మొదలుపెట్టారు.సెక్టార్ 53 లో నివసిస్తున్న జనక్ దేవ్ ఆకాశవాణిలో రిటైర్డ్ ఉద్యోగి.ఆయన కుటుంబ సభ్యులకు కేసు మేరకు పోలీసులు 34ఏ కింద FIR నమోదు చేసి పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు.

ఈ విషయంపై సదరు కుమారుడు సందీప్( Sandeep ) మాట్లాడుతూ.తన తండ్రి ప్రతిరోజు ఉదయం కుటుంబం కోసం అలా వాకింగ్ చేస్తూ బయటికి వెళ్లి పాలు తీసుకోవచ్చేవాడని తెలిపారు.కాంచన జంగా మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి మాకు చుట్టుపక్కల ప్రజలు తెలపడంతో తాము సంఘటన స్థలానికి చేరుకొని ఆ తర్వాత తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ దుర్ఘటనలో తమ తండ్రి చనిపోయాడని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారని తెలిపాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనం తెల్ల ఆడి కారని స్పష్టంగా అర్థం అవుతుందని.కాకపోతే.
, ఆ కారు సంబంధిత విషయాలను గుర్తించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.ముఖ్యంగా రిజిస్ట్రేషన్ నెంబర్ సరిగా క్యాప్చర్ కాలేకపోవడం కష్టంగా మారినట్లు తెలిపాడు.
ఈ విషయంపై పోలీసులు ఎలాగైనా త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.







