టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి భేటీకానున్నారు.ఈ మేరకు ఈ నెల 31న ఇరువురు నేతలు సమావేశం కానున్నారని సమాచారం.
ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగిన తీరుతో పాటు పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu, Pawan) చర్చించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలిసే ఛాన్స్ ఉంది.
అయితే ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రేపు అమరావతికి వెళ్లనున్నారు.