ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న పోస్టల్ బ్యాలెట్( Postal Ballot ) ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది.ఈ మేరకు సీఈసీకి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ( YCP MP Niranjan Reddy )మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఏపీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలను పరిశీలించాలని వైసీపీ సదరు ఫిర్యాదులో కోరింది.నిబంధనలతో సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్న ఆయన దీని వలన ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని ఫిర్యాదులో వెల్లడించింది.