సినీ నటి రేణు దేశాయ్ ( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.
ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులతో పెద్ద ఎత్తున గొడవకు కూడా దిగుతూ ఉంటారు.అంతేకాకుండా తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ సోషల్ మీడియాకు దూరమవుతున్నానని చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.తాను కొద్ది రోజులపాటు ఇంస్టాగ్రామ్ ( Instagram ) కి దూరంగా ఉండబోతున్నానని తెలిపారు.అయితే తాను దూరం అవడానికి కారణం లేకపోలేదని వెకేషన్ వెళ్తున్న సందర్భంగా తాను ఒక పది రోజులపాటు ఇంస్టాగ్రామ్ కి దూరంగా ఉంటున్నానని తెలిపారు.
ఈ విషయాన్ని తన ఫాలోవర్లకు, పెట్ టేక్ కేర్లకు, పెట్ ఆర్గనైజేషన్లకు ప్రత్యేకంగా చెబుతోందట.ఎవరికైనా అత్యవసరం అనిపిస్తే మాత్రం వాట్సప్ ద్వారా సంప్రదించండని చెప్పుకొచ్చింది.
ఇలా అత్యవసరం అయితే వాట్సాప్ ద్వారా సంప్రదించండి అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేయడంతో ఈమె మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక రేణు దేశాయ్ తాను సంపాదించిన దానిలో కొంత భాగం పెట్స్ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.ఇలా జంతు సంరక్షణ కోసం రేణు దేశాయ్ తన సొంత డబ్బును ఉపయోగించడమే కాకుండా అత్యవసరమైతే అభిమానులను తన ఫాలోవర్స్ ను కూడా సహాయం అడుగుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న సంగతి మనకు తెలిసినదే
.