దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam case) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుబంధ ఛార్జిషీట్ ను దాఖలు చేసింది.ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court ) పిటిషన్ వేసింది.
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత (Kavita) సహా ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) పరిగణనలోకి తీసుకుంది.అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత సహా నిందితులను రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.