ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు.లిక్కర్ స్కాం కేసులో( liquor scam case ) భాగంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది.అయితే లిక్కర్ స్కాం కేసులో ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే మధ్యంతర బెయిల్ పై కేజ్రీవాల్ బయటకు వచ్చారు.ఈ క్రమంలో అనారోగ్య కారణాల దృష్ట్యా తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.