ప్రస్తుతం ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియా( Social media )లో చక్కర్లు కొడుతోంది, ఇందులో ఒక ఓర్కా (తిమింగలం)( Orca ) దాని హ్యూమన్ ట్రైనర్ మధ్య ఓ ప్రత్యేక క్షణాన్ని మనం చూడవచ్చు.ఈ వీడియోలో లేడీ ట్రైనర్ ఒక అడ్డంకి దాటి ఓర్కాతో సంభాషిస్తూ కనిపిస్తుంది.
ట్రైనర్ కదలికలకు అనుగుణంగా తల వూపుతూ ఓర్కా లేదా కిల్లర్ వేల్ ఆమెను అర్థం చేసుకుంటున్నట్లు, స్పందిస్తున్నట్లు కనిపిస్తుంది.ట్రైనర్ సంతోషంగా ఓర్కాను ముద్దాడుతూ, దానికి బహుమతిగా చిరుతిండిని ఇస్తుంది.
ఈ హార్ట్ టచింగ్ సీన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో @kirakiraorca625 అనే యూజర్ షేర్ చేశారు, దీనికి ఇప్పటివరకు 89 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోకు జపనీస్‌లో ఓ క్యాప్షన్ రాశారు.తిమింగలం పేరు లారా అని వెల్లడించారు.ట్రైనర్, ఈ జలచరం మధ్య “స్కిన్ షిప్( Skin Ship )” అని పిలిచే సన్నిహిత సంబంధం ఉందన్నారు.
లారా చాలా ముద్దుగా ఉందని పేర్కొంది.ఈ వీడియో చూసి చాలా మంది ఫిదా అయిపోయారు.
జంతువు, శిక్షకురాలి మధ్య ప్రేమగల బంధానికి తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.కొంతమంది వ్యాఖ్యాతలు జంతువులు కొన్నిసార్లు మానవులకన్నా ఎక్కువ దయ, అనుబంధాన్ని చూపిస్తాయని కూడా అభిప్రాయపడ్డారు./br>
ఇటీవల జంతువుల ప్రేమానుబంధం చూపించే మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది! ఆ వీడియోలో ఒక పెద్దావిడ ఒక పులికి పాలు తాగించి దానిని నిద్రపుచ్చింది.ఈ వీడియోలు జంతువులు, మనుష్యుల మధ్య బంధాన్ని చూపించి, నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాయి.జంతువులు కూడా మనల్ని ప్రేమించగలవని, అర్థం చేసుకోగలవని ఈ వీడియోలు మరొక్కసారి నిరూపిస్తున్నాయి.