బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి.తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి ప్రతిపక్షం ప్రతినిధి సిరిసిల్ల జిల్లా మే 29: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్ ) ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం స్థానిక కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో (జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ) ఘనంగా నిర్వహించారు.టీపీటీఎఫ్ బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యను బలోపేతం చేయాలని,పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు.ఆగిపోయిన బదిలీలు పదోన్నతులను పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు నిర్వహించాలని,వెంటనే అన్ని పాఠశాలల్లో ఖాళీలు లేకుండా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించినప్పుడే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించగలమని అందువల్ల తప్పనిసరిగా తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు .గత కొన్ని సంవత్సరాలుగా పారిశుధ్య కార్మికులు లేక పాఠశాలలు దుర్గంధ భరితంగా తయారయ్యాయని అన్నారు.పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ ఉమా బాలచందర్ రాజు , రాష్ట్ర కౌన్సిలర్ పూరెల్ల రవీందర్, జిల్లా కమిటీ బాధ్యులు మల్లారపు పురుషోత్తం, సత్తు రవీందర్, విక్కుర్తి అంజయ్య, సూర భాస్కర్, మండల బాధ్యులు మైలారం తిరుపతి, బొజ్జ కృష్ణ, రామచంద్రం, బండి ఉపేందర్, లక్ష్మీనారాయణ, బచ్చు అశోక్, మధుసూదన్, కొండ వెంకటేశం, సిద్దంశెట్టి శ్రీనివాస్, బాలచందర్ రాజు, రమేష్ రెడ్డి, ఎనగందుల శంకర్, జగిత్యాల శ్రీనివాస్, చకినాల భాస్కర్, బాలగౌడ్, రాంప్రసాద్,సుభాష్ రెడ్డి, సుల్తాన్ శ్రీనివాస్, నజీర్ , జ్ఞానోభ తదితరులు పాల్గొన్నారు.







