దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ( TRS party ) తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలోనే తమ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుకుని వివిధ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేసింది.అయితే ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉన్న పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారడం ప్రస్తుత బీ ఆర్ ఎస్ కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.
ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీ కార్యకలాపాలు లేవు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేసే విషయంలోనూ తమ పార్టీ పేరు మారడం బీఆర్ఎస్ ( BRS )కు ఇబ్బందికరంగానే మారింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గీతం రాజకీయ వివాదం నడుస్తోంది .
తెలంగాణ రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ ( Jaya Jaya Telangana )కు స్వర కల్పన కీరవాణి చేయడం ప్రస్తుతం వివాదానికి కారణం అయింది.ఏపీకి చెందిన కీరవాణితో రాష్ట్ర గీతాన్ని స్వర కల్పన చేయించడంతో వీటిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గానే ఉంది.
రాష్ట్ర అధికారిక చిహ్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మార్పులపైనే వెన్ఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు చెబుతోంది తప్ప తెలంగాణ గీతాన్ని కీరవాణితో( keeravani ) పాటించడంపై బీఆర్ఎస్ నేతలు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు .దీంతో టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ సెంటిమెంట్ ను రాజకీయంగా వాడుకునే అవకాశాన్ని.బీఆర్ఎస్ కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతోపాటు గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏపీకి చెందిన నాయకులతో వ్యవహరించిన తీరు కూడా ఓ కారణంగా తెలుస్తోంది టిఆర్ఎస్ పేరు మార్చి ఉండకపోతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో బీఆర్ఎస్ పోరాటం చేసేందుకు అవకాశం ఏర్పడేది.ప్రస్తుతం ఆ అవకాశం కనిపించకే ఈ విధంగా సైలెంట్ గా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది