ప్రతినిత్యం సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వీడియోలు వైరల్ మారుతుంటాయి.తాజాగా పోస్ట్ షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్లోని లక్నో(Lucknow) నగరంలో పట్టపగలు రద్దీగా ఉండే నడి రోడ్డుపై ఒక వ్యక్తి చేతిలో తుపాకీ పట్టుకొని మరో వ్యక్తిని దాడి చేస్తున్న సన్నివేశాలు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బాగా రద్దీగా ఉన్న ఏరియాలో ఓ వ్యక్తిని పట్టుకొని మరొక వ్యక్తిపై ఆ పిస్టల్ బట్(Gun Butt) తో కొట్టి ఆయనతోపాటు ఇతరులతో కూడా రచ్చ సృష్టించారు.ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
లక్నో నగరంలోని ఓ యువకుడును బహిరంగ ఓ వ్యక్తి పిస్టల్ తో కొట్టి బెదిరించాడు.ఇకపోతే అలా గన్ పట్టుకున్న వ్యక్తి ఓ జాతీయ షూటర్.అంతేకాకుండా ఆయన సమాజ్వాది పార్టీ నాయకుడు వినోద్ మిశ్రా(Vinod Mishra).ఈ విషయాన్ని సోషల్ మీడియా నెటిజన్స్ పేర్కొన్నారు.వారణాసిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా ఆ వ్యక్తి గన్ తీసుకుని ఆ వేడుకలకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒక పోలీసుల అందించిన నివేదికల ప్రకారం.రోడ్డుపైన ఈ సంఘటన జరిగిందని., అక్కడున్న ఎస్యువి వాహనం జాతీయ షూటర్ వినోద్ మిస్రాకు(Vinod Mishra) చెందిందని తెలుపుతూ.
లక్నోలోని విభూతి కండ్ ప్రాంతం రోడ్డుపై ఈ ఘటన జరిగినందుకు తెలిపారు.ఈ ఘటన సంబంధించి వీడియో వైరల్ అవ్వడంతో దెబ్బలు తిన్న వ్యక్తి ఎస్పీకి కంప్లైంట్ చేయగా పోలీసులు అతడిని అరెస్టు చేసి చివరకు కటకటాల పాలు చేశారు.
సంబంధించిన వీడియో ఆ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.