నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ (Ayyappa Scanning Center)వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.స్కానింగ్ కు వచ్చిన మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో నలుగురు సీనియర్ మహిళా వైద్యులు ఉన్నారని తెలుస్తోంది.కాగా వారం రోజుల్లో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నారు.
ఈ నివేదిక ఆధారంగా స్కానింగ్ సెంటర్(Scanning Centro) పై సర్కార్ చర్యలు తీసుకోనుంది.