ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం( Israel-Hamas war ) అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది.ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల – వ్యతిరేక నిరసనలతో గత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతోంది.
ముఖ్యంగా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీలలో హింసాత్మక పరిస్ధితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ వివాదంలో చిక్కుకున్నారు.
లెబనాన్ ఉత్తర సరిహద్దు సమీపంలోని ఓ ప్రాంతంలో పర్యటించిన ఆమె.ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మోర్టార్ షెల్‌పై “Finish Them” అని రాశారు.దీనిపై పాలస్తీనా మద్ధతుదారులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

ఓ ఎక్స్ పోస్టులో నిక్కీ హేలీ( Nikki Haley ) మోకాళ్లపై కూర్చొని ఉండగా.ఆమెతో పాటు ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యుడు డానీ డానన్ ఉన్నారు.ఆమె సందేశం రెచ్చగొట్టే విధంగా ఉందని.
నిక్కీని అమెరికా నుంచి తన పూర్వీకుల మాతృభూమి అయిన భారతదేశానికి బహిష్కరించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.రఫాపై ఇజ్రాయెల్ మరణహోమం, సామాన్య ప్రజల మరణాల నేపథ్యంలో నిక్కీ చర్య వివాదానికి దారి తీసింది.
ఈ క్షిపణులు అంతిమంగా అమాయక పౌరులు, పిల్లలను చంపడానికి ఉపయోగించబడతాయని, ఇది తీవ్రవాదమని ఓ ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు.నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన విధానాన్ని మార్చే ఆలోచనలో లేరని వైట్‌హౌస్ ఇటీవల పేర్కొంది.

కాగా.గత ఆదివారం రాత్రి రఫా( Rafah )పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడికి దిగింది.ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా 60 మందికి గాయాలయ్యాయి.మరణించిన వారిలో మహిళలు, చిన్నారులే సగం మంది వరకు వున్నారు.
దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించింది.దీంతో ఉత్తర, మధ్య గాజాలకు చెందిన ప్రజలు కట్టుబట్టలతో తరలివచ్చి గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు.
అలాంటి ప్రదేశంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది.ఈ ఘటనను అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, నార్వే, ఈజిప్ట్, ఖతార్, టర్కీలు ఖండించాయి.
రఫాపై దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ( Benjamin Netanyahu ) సైతం తప్పుగా అంగీకరించారు.అమాయకులకు ఎలాంటి హాని కలగకుండా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని.
కానీ ఈ దారుణం జరిగిందన్నారు.హమాస్ కమాండర్లు ఆ ప్రాంతంలో ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.