కొందరు నటీమణులు కొన్ని సినిమాలే చేసిన ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంటారు.జనాల మందిలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
అలా తెలుగులోనూ కొందరు హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాలు చేసి జనాల నుంచి మంచి ఆదరణ అందుకున్నారు.అయితే వీరిలో కొంత మంది ఉన్నట్లుండి సడెన్ గా వెండి తెరకు దూరం అయ్యారు.
ఇలా వచ్చి అలా మెరిసి వెళ్లిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.వారిలో కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
*అన్షు
రాఘవేంద్ర, మన్మథుడు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.చేసింది రెండు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చింది.
ఆ తర్వాత అన్షు వెండి తెరకు దూరం అయ్యింది.ఎందుకు తను మళ్లీ సినిమాలు చేయలేదు.అనేది బయటకు తెలియదు.
*కమలినీ ముఖర్జీ
మన్యం పులి, గోవిందుడు అందరివాడేలే, జగద్గురు ఆది శంకర, ఆనంద్ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ లో నటించింది ఈ క్యూట్ బ్యూటీ.ఆ తర్వాత సినిమాల్లో నటించడం మానేసింది.
*గోపిక
అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న నటీమణి గోపిక.యువసేన, వీడు మామూలోడు కాదు, విజేత 2007 సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.నా ఆటోగ్రాఫ్ లాంటి హిట్ చిత్రంలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.
*గజాల
మనీ మనీ మోర్ మనీ, రాంబాబు గాడి పెళ్ళాం, భద్రాది, స్టూడెంట్ నెం 1, అల్లరి రాముడు సహా పలు హిట్ సినిమాల్లో నటించింది.యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ నటీమణి ప్రస్తుతం సినిమా పరిశ్రమ నుంచి బయటకు వెళ్లింది.
*రక్షిత
ఆంధ్రావాలా, అందరివాడు, జగపతి, ఇడియట్, నిజం, శివమణి చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ.అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది.
*రంభ
ఒక్కడు చాలు, నీకు నాకు, అల్లాడిస్తా సినిమాల్లో నటించింది.నైంటీస్ లో తెలుగు తెరను ఊపు ఊపింది ఈ అమ్మడు.సెకెండ్ ఇన్నింగ్స్ లో దేశముదురు, యమదొంగ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ చేసింది.ఆ తర్వాత సిల్వర్ స్ర్కీన్ కు దూరం అయ్యింది.
*రీమాసేన్
వాడు వీడు, ముగ్గురు, ఆయనకి ఐదుగురు, చిత్రం, బంగారం సినిమాలతో రీమాసేన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.
*సోనియా దీప్తి
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, మిస్టర్ మన్మథ, దూకుడు, హ్యాపీడేస్ సినిమాల్లో నటించింది.దూకుడు తర్వాత చిన్నాచితకా సినిమాల్లో నటించి వెండి తెరకు దూరం అయ్యింది.
*అషిమా భల్లా
ధర్మ, చేప్పవే చిరుగాలి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత సినిమా పరిశ్రమ నుంచి వైదొలిగింది.