హైదరాబాద్ లోని ప్రజాభవన్( Praja Bhavan ) కు వచ్చిన బాంబు బెదిరింపు కేసుపై పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ప్రజాభవన్ లో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలిపోతుందంటూ నిందితుడు ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రజాభవన్ ను జల్లెడ పట్టారు.
సుమారు రెండు గంటల పాటు గాలించిన పోలీసులు ఫేక్ కాల్ గా నిర్ధారించారు.ఈ క్రమంలోనే ఇవాళ నిందితుడు శివరామకృష్ణ( Sivaramakrishna )ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముషీరాబాద్ లో నివాసం ఉంటున్న శివ రామకృష్ణ మద్యం మత్తులో కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసినట్లు గుర్తించారు.