వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న అమెరికా అధ్యక్షుడు జో జైడెన్(Joe Biden ).మొన్నామధ్య కమలా హారీస్( Kamala Harris )ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు .
అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం చెప్పలేక తడబడ్డారు.తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా – ఉక్రెయిన్ సమస్య గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.

ఆ తర్వాత చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే సందర్భంగా సెనేట్ మెజారిటీ నేత చక్ షుమెర్ అక్కడున్న వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.బైడెన్‌కి కూడా ఇచ్చి, పక్కకు జరిగారు.సరిగ్గా ఇదే సమయంలో బైడెన్ మతిమరుపు బయటపడింది.అప్పటికే తనకు షుమెర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మరిచిపోయిన పెద్దాయన.మరోసారి కరచాలనం కోసం చేయి ఇచ్చారు.అప్పట్లో ఈ ఘటన వైరల్ అయ్యింది.
ఇలా ఒకటి కాదు రెండు కాదు.బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.

తాజాగా అధ్యక్ష ఎన్నికల వేళ జో బైడెన్ ఇబ్బందుల్లో పడ్డారు.‘‘ మెమోరియల్ డే సర్వీస్( Memorial Day service ) ’’లో అధ్యక్షుడు నిద్రపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అమెరికా కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారి గౌరవార్ధం ఏర్పాటు చేసిన సభలో వారిని అవమానించేలా బైడెన్ ఇలా వ్యవహరించడం ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.అతను నిద్రపోతున్న వీడియోను స్క్రీన్ షాట్లు తీసి ‘‘ స్లీపీ జో ’’ అంటూ సెటైర్లు వేశారు.
బహుశా ఆయనకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం విసుగు పుట్టించిందని ఎద్దేవా చేశారు.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ అనర్హుడని మరికొందరు వ్యాఖ్యానించారు.మరణించిన హీరోలను గౌరవించే కార్యక్రమంలో బైడెన్ నిద్రపోయాడని .ఈ సందర్భంగా సైనికుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని మరో ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు.మెమోరియల్ డే లేదా డెకరేషన్ డే అనేది యునైటెడ్ స్టేట్స్‌లో సెలవుదినం.సాయుధ బలగాల్లో పనిచేస్తుండగా మరణించిన అమెరికా సైనిక సిబ్బందిని ఈ సందర్భంగా గౌరవించుకుంటారు.సదరు వీడియోలో జో బైడెన్ నిద్రపోతున్నప్పుడు రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ప్రసంగిస్తున్నారు.మెమోరియల్ వేడుకలకు ముందు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, డిఫెన్స్ సెక్రటరీ ఆస్టిన్ లాయిడ్‌లు ఓ సైనికుడి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
అనంతరం ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు.స్వేచ్ఛ ఎప్పుడూ హామీ ఇవ్వబడలేదని, ప్రతితరం దానిని సంపాదించాలి, దాని కోసం పోరాడాలి, నిరంకుశత్వం, ప్రజాస్వామ్యం మధ్య దానిని రక్షించాలని జో బైడెన్ పిలుపునిచ్చారు.