ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల గామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.అయితే త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs Of Godavari ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి నందమూరి నట సింహం బాలకృష్ణ( Balakrishna ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ సేన్ బాలయ్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రమాదానికి గురయ్యానని విశ్వక్ తెలిపారు.

లారీ పై నుంచి కింద పడటంతో మోకాలి దెబ్బ తగిలిందని అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ప్రమాదం ఏమీ లేదు రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు.నేను ప్రమాదానికి గురయ్యాననే విషయం బాలయ్య గారికి తెలియడంతో వెంటనే ఆయన నాకు ఫోన్ చేశారని విశ్వక్ తెలిపారు.బాలయ్య గారు ఫోన్ చేసిన సమయంలో నాకు ఆయన వాయిస్ లో లౌడ్ కనిపించలేదని నాకోసం ఆయన ఎంతో బాధపడ్డారు అది మాత్రమే కనిపించిందని తెలిపారు.
చాలా రోజుల తర్వాత నేను ఏడ్చాను లవ్ యు సార్ అంటూ అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ విశ్వక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






