సినీ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రచయిత పరిచయ గోపాలకృష్ణ (Parachuri Gopalakrishna)ఒకరు.ఈయన ఇప్పటికీ పలు సినిమాలకు రచయితగా పనిచేస్తున్నారు.
అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరుచూరి పలుకలు అంటూ కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూలను ఇస్తూ ఉంటారు.అయితే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కల్కి(Kalki)దేవర (Devara) సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్ హీరోలైనటువంటి ప్రభాస్(Prabhas ) ఎన్టీఆర్(NTR ) నటించిన ఈ సినిమాల కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఇక ఈ సినిమాల గురించి పరుచూరి మాట్లాడుతూ.ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ (Kamal Haasan, Amitabh) వంటి స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు.అయితే ఈ హీరోలందరూ థియేటర్లో కనిపిస్తే ప్రేక్షకులు ఎవరూ కూడా సీట్లలో కూర్చొరని ఈయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఈయన కోరారు.ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.ప్రభాస్ ఆరడుగులు ఉన్న చూడటానికి పస పిల్లాడి మనస్తత్వం అని తెలిపారు.ఇప్పటివరకు ఆయన పరుష పదజాలన్ని నేను వినలేదని తెలిపారు.

ఇక దేవర సినిమా గురించి మాట్లాడుతూ.ఆది సినిమాలో కనిపించిన ఎన్టీఆర్(NTR) ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందని తెలిపారు.త్వరలోనే దేవరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇందులో తారక్ గెటప్ చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు.ఇందులోనూ స్టార్స్ చాలా మంది నటిస్తున్నారు.ఇది అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
ఇక కల్కి దేవర రెండు సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని ఈయన తెలిపారు.







