విషవాయువులు పీల్చి భారత సంతతి వ్యక్తి మృతి.. మలేషియాకు వెళ్లాల్సినోడు చివరికి

సింగపూర్‌( Singapore )లో విషాదం చోటు చేసుకుంది.విషవాయువులు పీల్చి భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

 Indian-origin Man Dies After Inhaling Toxic Fumes In Singapore ,singapore , Sri-TeluguStop.com

వివరాల్లోకి వెళితే .తమిళనాడు రాష్ట్రానికి చెందిన శ్రీనివాసన్ శివరామన్ సింగపూర్‌లోని సూపర్‌సోనిక్ మెయింటెనెన్స్ సర్వీసెస్‌లో క్లీనింగ్ ఆపరేషన్స్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.ఈ నెల 23న నేషనల్ వాటర్ ఏజెన్సీ పబ్‌కి సంబంధించి చోవాచు కాంగ్ వాటర్ వర్క్స్‌లో క్లీనింగ్ పనులు నిర్వహిస్తున్నారు.

Telugu Gardens Bay, Hydrogen, Indian Origin, Indian, Toxic Fumes, Malaysia, Sing

ఈ క్రమంలో శ్రీనివాసన్( Srinivasan Sivaraman ) సహా మరో ఇద్దరు కార్మికులు విషవాయువులు పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.దీంతో అధికారులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా శివరామన్ అదే రోజు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.మిగిలిన ఇద్దరు కార్మికులు ఐసీయూలోనే ఉన్నారు.

శ్రీనివాసన్‌కు భార్య నర్మదా, ఇద్దరు కుమార్తెలు మహాశ్రీ, శ్రీనిషా వున్నారు.ఈమె తన సోదరుడు మోహన్ నవీన్ కుమార్‌తో కలిసి సింగపూర్‌లోనే నివసిస్తున్నారు.

హైడ్రోజన్ సల్ఫైడ్( Hydrogen sulfide ) వాయువుని పీల్చడం వల్లే వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Telugu Gardens Bay, Hydrogen, Indian Origin, Indian, Toxic Fumes, Malaysia, Sing

వాస్తవానికి శివరామన్ ఈ నెల 27న సెలవుపై మలేషియా( Malaysia ) వెళ్లాల్సి ఉంది.అయితే దానికంటే ముందు ఓ రోజు సింగపూర్‌లో ఉండాలని అనుకోగా, ఇంతలో ఈ దారుణం జరిగిందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.సంఘటన జరిగిన రోజున శివరామన్ యథావిధిగా డ్యూటీకి వెళ్లాడని.

‘‘ గార్డెన్స్ బై ది బే ’’ని సందర్శించేందుకు సాయంత్రం 5 గంటలకు సిద్ధంగా ఉండాల్సిందిగా భార్యాపిల్లలకు చెప్పారని అతని బంధువు నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.సింగపూర్‌లో అతని భౌతికకాయానికి నివాళులర్పించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు భారీగా హాజరయ్యారు.

మే 26న శ్రీనివాసన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, మంగళవారం భారత్‌లోని అతని స్వగ్రామం తమిళనాడులోని తంజావూరు జిల్లా కంబర్నాథమ్‌కు తరలించినట్లుగా సింగపూర్ సూపర్‌సోనిక్ కంపెనీ పేర్కొంది.శ్రీనివాసన్ మరణవార్తతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube