వృద్ధురాలే కానీ బ్రెడ్ పకోడీలు ఎంత ఫాస్ట్‌గా చేస్తుందో చూస్తే..??

సాధారణంగా వంట పని చాలా శ్రమతో కూడుకున్నది.వయసులో ఉంటేనే ఈ పని ఎక్కువసేపు చేయగలం.

 Old Lady But If You See How Fast Bread Pakoras, Street Food Vendor, Bread Pakor-TeluguStop.com

ఇక టిఫిన్ సెంటర్లు నడపాలంటే ఏం చాలా కష్టమే చెప్పుకోవచ్చు.కానీ కొంతమంది వృద్ధులు మాత్రం చాలా కష్టమైన ఈ వంట పనులను తేలిగ్గా చేసేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.

కొందరు అవ్వలైతే వయసులో ఉన్న వారి కంటే వేగంగా పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తారు.అలాంటి వృద్ధురాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సూరత్‌( Surat )లో రోడ్డు పక్కన ఈ అవ్వ బ్రెడ్ పకోడాలు ప్రిపేర్ చేస్తున్నారు.ఆమె చేసే పకోడాలు చాలా రుచిగా ఉంటాయట.అంతేకాదు, ఆమె కస్టమర్లతో మాట్లాడుతూ, తన జీవితం గురించి చెప్తూ ఉంటుందట.చాలామంది ఆమెతో సరదాగా మాట్లాడడానికి, అలాగే టేస్టీ బ్రెడ్ పకోడా( Bread pakora ) తినడానికి క్యూ కడుతున్నారు.

ఒక ఫుడ్ వ్లాగర్ అయిన అమర్ సిరోహీ( Amar Sirohi ) ఆ బామ్మను కలిసి, ఆమె సింగిల్ డే ఎలా పని గడుస్తుందో ఒక వీడియో తీశారు.ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.

ఆ వీడియోలో, ఆ బామ్మ తను చేసే బ్రెడ్ పకోడాల గురించి చాలా విషయాలు చెప్పింది.సూరత్‌లో ఈ బ్రెడ్ పకోడాలు చాలా ఫేమస్ అని, తన దగ్గర ఎప్పుడూ కస్టమర్లు కిక్కిరిసి ఉంటారని పేర్కొంది.సాధారణంగా పకోడీలు తయారీలో శెనగపిండి వాడతారు కదా, ఆమె మాత్రం స్ప్రింగ్ రోల్ పేపర్స్ ఉపయోగిస్తోంది.ఆ తర్వాత వాటిని నూనెలో వేయించి బ్రెడ్ పకోడాలు తయారు చేస్తోంది.

ఇది ఆరోగ్యానికి మంచిదని అంటోంది.ఈ పకోడీల్లో చీజ్, కూరగాయలు కూడా చాలా యాడ్ చేస్తోంది.

చివరగా చిన్న ముక్కలుగా కోసి, చాట్ మసాలా కూడా చల్లుతుంది.ఒక ప్లేట్ బ్రెడ్ పకోడాలు 30 రూపాయలు.

ఆమె ఇంత వయసులో కూడా కష్టపడి పని చేస్తున్నందుకు చాలా మంది ఆమెను ప్రశంసిస్తున్నారు.కొంతమంది ఆ వీడియో చూసి, “ఇది చాలా ప్రత్యేకంగా ఉంది” అని కామెంట్ చేశారు.

మరికొందరు, “గుజరాత్‌లోని పెద్దవారు నెమ్మదిగా ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్నారు” అని కామెంట్ చేశారు.మరికొందరు, “ఆమె తన పనిని ఎంతో ఇష్టపడుతుందని అర్థమవుతుంది” అని రాశారు.

ఆమె స్టాల్‌లో తింటే ఎలా ఉంటుందో తమ అనుభవాలను కూడా కొంతమంది పంచుకున్నారు.ఈ వీడియో ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube