ఏదైనా పని చేసి, దాన్ని సీక్రెట్ గా ఉంచాలని ఎంత ట్రై చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే.దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.25 ఏళ్ల SS ఘటోల్( SS Ghatol ) అనే యువతికి కూడా అదే జరిగింది.ఫ్యాషన్ మెర్చండైజింగ్ చదువుతున్న ఈ అమ్మాయి స్నేహితులకు చెప్పకుండా, తన కాలేజీకి తెలియకుండా, సీక్రెట్‌గా థాయ్‌లాండ్( Thailand )కు వెళ్ళింది.
ఈ విషయం ఎవరికీ తెలియకూడదని, పాస్‌పోర్ట్‌లోని కొన్ని వివరాలను కట్ చేసింది.కానీ, ఈ పని చేయడం వల్ల ఆమె ఇంకా పెద్ద ఇబ్బందుల్లో పడింది.
గురువారం సింగపూర్( Singapore )కు విమానంలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై విమానాశ్రయంలో ఘటోల్ను అడ్డుకున్నారు.పాస్‌పోర్ట్‌లోని వివరాలు లేదా పేజెస్ మిస్ కావడం వల్ల ఆమెను స్టాప్ చేశారు.పాస్‌పోర్ట్‌లోని వివరాలను మార్చడానికి ట్రై చేయడం చాలా పెద్ద నేరం.ఆమె ఫస్ట్ ఇయర్ స్టూడెంట్.తన కాలేజీ సహాయంతో సింగపూర్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని పొందింది.ఆమె వద్ద టూరిస్ట్ వీసా ఉంది.
అయితే ఇంటర్న్‌షిప్ కోసం పాస్‌పోర్ట్ సమర్పించమని ఇన్స్టిట్యూట్ ఆమెను కోరింది.ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు వెళ్లిన తన థాయ్‌లాండ్ ట్రిప్ గురించి తెలిసిపోతుందని ఆమె భయపడింది.
ఆ తేదీలలో తనకు అనారోగ్యంగా ఉందని పేర్కొంటూ ఆమె గతంలో పరీక్ష నుంచి మినహాయింపు కూడా కోరింది.
ఘాటోల్ చేసిన పని వల్ల ఆమె ఇప్పుడు చాలా పెద్ద ఇబ్బందుల్లో పడింది.ఆమె మీద పోలీసులు కేసు పెట్టారు.ఆమె అబద్ధం చెప్పింది కాబట్టి ఆమె మీద మోసం చేసినట్లు కేసు పెట్టారు.
అంతేకాకుండా, ఆమె తన పాస్‌పోర్ట్‌ని చింపింది కాబట్టి పాస్‌పోర్ట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కూడా కేసు పెట్టారు.ఇప్పుడు ఆమె మీద కోర్టులో విచారణ జరుగుతుంది.