ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్( Breakfast ) కు ముందు ఒకసారి తర్వాత ఒకసారి టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.అయితే బ్రేక్ ఫాస్ట్ తర్వాత టీ, కాఫీలు తాగే బదులు ఒక గ్లాసు పల్చటి మజ్జిగ తాగితే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
అధిక రక్తపోటు సమస్య( High blood pressure )తో బాధపడే వారికి మజ్జిగ ఒక వరం అని చెప్పుకోవచ్చు.ఉదయం పూట ఒక గ్లాసు మజ్జిగ తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మజ్జిగలో కాల్షియం మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి.ఇవి ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి మద్ధతు ఇస్తాయి.
బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా సహాయపడతాయి.
ఉదయం పూట ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.నీరసం అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.అతిసారం సమస్యతో బాధపడుతున్న వారు మజ్జిగలో అల్లం రసం కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే అతిసారం దూరం అవుతుంది.మజ్జిగలో కొవ్వు మరియు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారు కూడా మజ్జిగ తీసుకోవచ్చు.తద్వారా ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది అతి ఆకలి దూరం అవుతుంది.
మజ్జిగలో ఉండే లాక్టోజ్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరాన్ని తయారు చేస్తుంది.మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఉదయం పూట ఒక గ్లాసు చొప్పున రోజూ తాగితే జీర్ణాశయం పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.దాంతో జీర్ణాశయ సమస్యలకు( Digestive problems ) దూరంగా ఉండవచ్చు.
మజ్జిగ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇక ఉదయం పూట ఒక గ్లాస్ మజ్జిక తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.