చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో( child trafficking case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా రాచకొండ పోలీస్ బృందాలు( Rachakonda Police teams ) ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కిరణ్, ప్రీతి ( Kiran, Preeti )కీలక సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే చిన్నారులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.కాగా ఇప్పటివరకు సుమారు యాభై మంది చిన్నారులను ముఠా సభ్యులు అమ్మేశారని తెలుస్తోంది.
అయితే చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు.అక్రమంగా పిల్లలను కొన్న తల్లిదండ్రులపై లీగల్ గా పోలీసులు ముందుకు వెళ్తామని వెల్లడించారు.